Karisma Kapoor Reveals if She Will Get Married Again - Sakshi
Sakshi News home page

Karisma Kapoor: మళ్లీ పెళ్లి చేసుకుంటానేమో! చెప్పలేం అంటున్న హీరోయిన్‌

Apr 29 2022 2:25 PM | Updated on Apr 29 2022 3:07 PM

Karisma Kapoor Responds to a Fan Who Asked if She Would Ever Get Married Again - Sakshi

మళ్లీ  పెళ్లి చేసుకుంటారా? అని ఓ నెటిజన్‌ అడగ్గా అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందని తెలిపింది. అంటే తను రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని సూచనప్రాయంగా చెప్పుకొచ్చింది. కాగా కరిష్మా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్‌ కపూర్‌ను 2003లో పెళ్లి చేసుకుంది.

బాలీవుడ్‌ హీరోయిన్‌ కరిష్మా కపూర్‌ తాజాగా తన ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ చేసింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చింది. ఫేవరెట్‌ కలర్‌ ఏదన్న ప్రశ్నకు బ్లాక్‌ డ్రెస్‌లో ఉన్న వీడియో క్లిప్‌కు షేర్‌ చేసింది. ఇష్టమైన ఫుడ్‌ ఏది? అన్న క్వశ్చన్‌కు బిర్యానీ అని బదులిచ్చింది. రణ్‌బీర్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌.. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం? అంటే వీళ్లిద్దరూ ఇష్టమేనంది.

'మళ్లీ పెళ్లి చేసుకుంటారా?' అని ఓ నెటిజన్‌ అడగ్గా అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందని తెలిపింది. అంటే తను రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని సూచనప్రాయంగా చెప్పుకొచ్చింది. కాగా కరిష్మా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్‌ కపూర్‌ను 2003లో పెళ్లి చేసుకుంది. వీరికి సమైరా, కియాన్‌ ఇద్దరు సంతానం. ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో 2014లో విడాకుల కోసం దరఖాస్తు పెట్టుకోగా 2016లో విడాకులు మంజూరయ్యాయి.

చదవండి: అమెజాన్‌ ప్రైమ్‌లో 40 ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌, సినిమాలు

ఏళ్లుగా వెంటాడుతున్న సెంటిమెంట్‌, ఆచార్య బయటపడేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement