తప్పతాగి డ్రైవింగ్‌.. ప్రముఖ సింగర్ అరెస్ట్! | Justin Timberlake Arrested For Driving While Intoxicated In New York | Sakshi
Sakshi News home page

Justin Timberlake: మద్యం మత్తులో డ్రైవింగ్‌.. సింగర్ టింబర్‌ లేక్ అరెస్ట్!

Published Tue, Jun 18 2024 7:53 PM | Last Updated on Tue, Jun 18 2024 8:20 PM

Justin Timberlake Arrested For Driving While Intoxicated In New York

ప్రముఖ అమెరికన్ సింగర్‌, గ్రామీ అవార్డ్ విన్నర్‌ జస్టిన్ ‍టింబర్‌లేక్‌ అరెస్టయ్యారు. తప్పతాగి డ్రైవింగ్ చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్‌ ఐలాండ్‌లోని సాగ్ హార్బర్‌లో అతన్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని స్థానికి మీడియా ధృవీకరించింది. ప్రస్తుతం ఆయన పోలీసులు కస్టడీలోనే ఉన్నారు.

ప్రస్తుతం ‍టింబర్‌లేక్‌ ఫర్గెట్ టుమారో పేరుతో గ్లోబల్ టూర్‌లో ఉన్నాడు. మార్చిలో ప్రారంభమైన కొత్త ఆల్బమ్ "ఎవ్రీథింగ్ ఐ థాట్ ఇట్ వాస్" ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. వచ్చే వారంలో చికాగో, న్యూయార్క్‌లోని కచేరీలను నిర్వహించనున్నారు. ఆ తర్వాత యూరప్‌లో టింబర్‌ లేక్‌ ప్రదర్శనలు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి.

కాగా.. టింబర్‌ లేక్ 2002లో సోలో రికార్డింగ్ వృత్తితో కెరీర్ ప్రారంభించాడు. ది సోషల్ నెట్‌వర్క్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అవైన్ వంటి చిత్రాలలో కనిపించాడు. తన టాలెంట్‌ గానూ గ్రామీ అవార్డ్‌ దక్కించుకున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement