భర్తని పరిచయం చేసిన హీరోయిన్ ఇలియానా.. ఇతడెవరో తెలుసా? | Sakshi
Sakshi News home page

Ileana Husband: ఆ విషయం చెప్పట్లేదు కానీ భర్త ఫొటో పోస్ట్ చేసింది!

Published Sat, Nov 25 2023 4:52 PM

Ileana Husband Pic Latest With New Born Child - Sakshi

జీరో సైజ్ బ్యూటీ అననగానే చాలామందికి గుర్తొచ్చే పేరు ఇలియానా. అప్పట్లో పలు తెలుగు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. తన నాజుకు నడుముతో కుర్రాళ్లని పిచ్చెక్కించేసింది. ఆ తర్వాత ఈమెకి టాలీవుడ్ లో ఛాన్సులు తగ్గిపోవడంతో స్క్రీన్ పై కనిపించడం మానేసింది. ఇకపోతే ఈ ఏడాది ఆగస్టులో బిడ్డకు జన్మనిచ్చింది కానీ పెళ్లి-భర్త గురించి మాత్రం ఎక్కడ రివీల్ చేయలేదు. ఎట్టకేలకు ఇప్పుడు తన భర్త ఫొటోని బయటపెట్టింది.

గోవా బ్యూటీ ఇలియానా.. 'దేవదాసు' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత' పోకిరి'తో స్టార్ హోదా దక్కించుకుంది. 10కి పైగా తెలుగు మూవీస్ చేసినప్పటికీ.. జల్సా, కిక్, జులాయి తప్పితే చెప్పుకోదగ్గవి ఈమె కెరీర్‌లో లేవు. అలానే తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. ఇక ఈమె నటించిన రెండు హిందీ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. 

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)

ఇకపోతే ఈ ఏడాది ఏప్రిల్ లో తను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు బయటపెట్టిన ఇలియానా.. భర్త ఎవరు? అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఆగస్టులో మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొన్నాళ్లకు ఫొటోని స్టోరీలో పెట్టింది తప్పితే అతడు భర్త కాదా అనేది రివీల్ చేయలేదు. తాజాగా ఇన్ స్టాలో ఫాలోవర్లతో ముచ్చటిస్తుండగా.. మీరు సింగిల్ పేరెంటా? అని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి బదులిస్తూ తన భర్తతో కలిసున్న ఫొటోని ఇలియానా స్టోరీలో పోస్ట్ చేసింది.

అతడి పేరు మైఖేల్ డోలన్ అని మాత్రమే తెలుసు తప్పితే అతడు ఏం చేస్తున్నాడు? ఇండస్ట్రీతో సంబంధం ఏమైనా ఉందనేది మాత్రం ఇంకా సస్పెన్స్. అలానే వీళ్లిద్దరూ ఈ ఏడాది మే నెలలోనే పెళ్లి చేసుకున్నారని అంటున్నారు. కానీ ఇందులో నిజం మాత్రం తెలియాల్సి ఉంది. 

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్‌.. రిజల్టిదే!)

Advertisement
 
Advertisement
 
Advertisement