సీతారామం హీరో బర్త్‌ డే.. తెలుగులో మరో మూవీ! | Dulquer Salmaan new movie announced on his 41st birthday | Sakshi
Sakshi News home page

Aakasam Lo Oka Tara: తెలుగులో మరో సినిమాకు రెడీ అయిన దుల్కర్ సల్మాన్‌!

Jul 28 2024 3:27 PM | Updated on Jul 28 2024 3:27 PM

Dulquer Salmaan new movie announced on his 41st birthday

సీతారామం మూవీతో సూపర్ హిట్ అందుకున్న నటుడు దుల్కర్ సల్మాన్. ఆ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌ అయిపోయాడు. ప్రస్తుతం లక్కీ భాస్కర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే కల్కి 2898 ఏడీలోనూ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో మరో కొత్త మూవీని ప్రకటించారు. తెలుగులో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా దుల్కర్ పుట్టిన రోజు కావడంతో మూవీ టైటిల్‌ మేకర్స్ రివీల్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణసంస్థ స్వప్న సినిమాస్‌ దుల్కర్‌ సల్మాన్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో దుల్కర్ సాంప్రదాయ కుర్తా, ఎరుపు కండువా ధరించి కనిపించాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళం, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా..దుల్కర్ నటించిన లక్కీ భాస్యర్ సెప్టెంబర్ 7వ తేదీ 2024న విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement