మాజీ భర్త రెండో పెళ్లి.. 50 ఏళ్ల వయసులో హీరోయిన్ బ్రేకప్! | Sakshi
Sakshi News home page

యంగ్ హీరోకు బ్రేకప్ చెప్పేసిన సీనియర్ హీరోయిన్!

Published Sun, Jan 7 2024 9:49 AM

Bollywood Actress Breakup With Young Hero Goes Viral In Social Media - Sakshi

సినీ ఇండస్ట్రీలో లవ్, డేటింగ్, బ్రేకప్‌లు ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. బాలీవుడ్‌లో అయితే కాస్తా ఎక్కువగానే ఇలాంటి వార్తలు తరచుగా వస్తుంటాయి. అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్ బ్రేకప్‌ చెప్పుకున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఓ యంగ్ ‍హీరోకు స్టార్‌ హీరోయిన్ దూరంగా ఉంటున్నట్లు లేటెస్ట్ టాక్. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ భామ మలైకా అరోరా. ప్రస్తుతం ఈ టాపిక్‌ బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. 

ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఉన్న మలైకా.. ఇప్పటికే తన మొదటి భర్తతో అర్బాజ్‌ ఖాన్‌తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్‌ కొనసాగిస్తోంది. కొన్నేళ్ల పాటు సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్న భామ..  2019లో తమ రిలేషన్‌ను బయటపెట్టారు. గతంలో చాలాసార్లు ఈవెంట్లలో ఈ జంట కనిపించి సందడి చేశారు. తాజాగా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే కొద్ది రోజులుగా ఈ జంట సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. ఇటీవలే మలైకా తన స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలు చేసుకుంది. అలాగే న్యూ ఇయర్‌ వేడుకల్లోనూ అర్జున్ కపూర్, మలైకా దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రేకప్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనే దానిపై బాలీవుడ్ భామ క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది. 

ఇటీవలే మలైకా మొదటి భర్త అర్బాజ్ ఖాన్ 57 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.  మలైకా అరోరాకు నటుడు అర్బాజ్ ఖాన్ 1998 సంవత్సరంలో పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత అర్బాజ్, మలైకా విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement