సిగ్నల్ పూర్..భక్తుల బేజారు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందక సాధారణ భక్తులు, విధులకు వచ్చిన ప్రభుత్వ సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. సాధారణ రోజుల్లోనే ఈ ప్రాంతంలో సిగ్నల్స్ సరిగా అందవు. ఇక ఇంటర్‌నెట్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు రెండు టవర్లు ఉన్నప్పటికీ సిగ్నల్స్, ఇంటర్ నెట్ అంతంత మాత్రంగానే ఉంటోంది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుందని, సిగ్నల్ ఫ్రీక్వెన్సీ పెంచాలని కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్‌షెరాన్‌లు సర్వీస్ ప్రొవైడర్లతో గురువారం సమావేశం నిర్వహించి ఆదేశించారు. అయితే టెలికాం ప్రొవైడర్లు బూస్టర్లు పెంచినప్పటికీ ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంది. ఫోన్ మాట్లాడుతూ కదిలితే సిగ్నల్స్ జంప్ అవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఘాట్‌రోడ్ వెంబడి, ఇతర లొకేషన్లలో పనిచేసే పోలీస్‌లు కూడా సిగ్నల్, నెట్ సరిగా పనిచేయక పోవడంతో అవస్థలు పడుతున్నారు.


