జిల్లాలో రెండు మద్యం దుకాణాల ఏర్పాటుకు రీనోటిఫికేషన్
● ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
● 23వ తేదీన లాటరీ ద్వారా లైసెన్స్ జారీ
కర్నూలు: జిల్లాలో లైసెన్స్ ఫీజు చెల్లించకుండా ఆగిపోయిన రెండు మద్యం దుకాణాల ఏర్పాటుకు కలెక్టర్ అనుమతితో ఎకై ్సజ్ అధికారి మచ్చ సుధీర్ బాబు రీనోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాలోని ఎమ్మిగనూరు రూరల్‌లో ఒకటి, చిప్పగిరి మండలం యూనిట్‌లో ఒక దుకాణాలను గతంలో నిర్వహించిన టెండర్లు దక్కించుకున్నవారు లైసెన్స్ ఫీజు చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఆదేశం మేరకు వాటి ఏర్పాటుకు గురువారం రీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఈఎస్ సుధీర్ బాబు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 21వ తేదీ సాయంత్రం లోగా ఆయా దుకాణాలకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లేదా హైబ్రిడ్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక్కొక్క దుకాణానికి కనిష్టంగా ఒక దరఖాస్తు వస్తేనే లాటరీ ద్వారా దుకాణాన్ని కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను బట్టి ఈ నెల 23వ తేదీన రెండు దుకాణాలకు కలెక్టర్ సమక్షంలో లాటరీ తీసి లైసెన్స్‌ను జారీ చేయనున్నట్లు ఈఎస్ పేర్కొన్నారు.


