మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదాం
కర్నూలు (టౌన్): త్వరలో నిర్వహించే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కలిసికట్టుగా పని చేద్దామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు నియోజవర్గం పరిధిలోని 78 సచివాలయాల్లో కమిటీలను బలోపేతం చేయాలన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లోని తన చాంబర్‌లో గురువారం పార్టీ అనుబంధ విభాగాల కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తలకు భరోసా కల్పించడమే కమిటీల ఉద్దేశమన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. కమిటీ నాయకులకు డిజిలైజేషన్ చేసిన గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పార్టీ కల్పిస్తోందన్నారు. అధికారంలోకి వస్తే పదవులు తప్పనిసరిగా కల్పించేందుకు కేంద్ర పార్టీ ఇప్పటి నుండే చర్యలు చేపట్టిందన్నారు. కర్నూలు నియోజకవర్గ కమిటీ నాయకులు త్వరలో నిర్వహించే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కలిసికట్టుగా పని చేయాలన్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వంలో పట్టణ ప్రజలు తీవ్ర అంసతృప్తిలో ఉన్నారన్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు ఇస్తామని ఆశలు కల్పించి చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కర్నూలు నియోజకవర్గంలోని 33 వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అంతకు ముందు 1 నుంచి 11 వార్డుల నాయకులతో జిల్లా అధ్యక్షుడు సమావేశం నిర్వహించి దిశనిర్దేశం చేశారు.
పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు
ప్రత్యేక గుర్తింపు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి


