ప్రశాంతంగా ప్రాక్టికల్ పరీక్షలు
● 122 మంది గైర్హాజరు
జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా 10 సెంటర్లలో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జితేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం జనరల్, ఒకేషనల్ ప్రయోగ పరీక్షలు రెండు విడతలుగా నిర్వహించగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. సీసీ కెమెరా నిఘాలో బోర్డు నిబంధనల మేరకు నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం జనరల్ విద్యార్థులు 530 విద్యార్థులకు గాను 523మంది హాజరయ్యారు, 7 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షలో 739 విద్యార్థులకు గాను 661 హాజరుకాగా 78మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జనరల్ మొత్తం 450 విద్యార్థులకు గాను 437 హాజరయ్యారు, 13 గైర్హాజరయ్యారు. ఒకేషనల్ మొత్తం 611 విద్యార్థులకు గాను 587 హాజరయ్యారు, 24 గైర్హాజరయ్యారు. డీఈసీ సభ్యులు శ్రీనివాస్ శేఖర్, ఫ్లయింగ్ సభ్యులు పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు.


