సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకం

Feb 2 2026 7:47 AM | Updated on Feb 2 2026 7:47 AM

సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకం

సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకం

పాలకుర్తి టౌన్‌: యువత సమాజ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ వరంగల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ చింతల అన్వేష్‌ సూచించారు. ఆదివారం మండల కేంద్రంలో యువత చైతన్య యూత్‌ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో యువ మండల్‌ వికాస్‌ అభియాన్‌ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి, దేవరుప్పల, కొడకండ్ల మండలాల నుంచి పెద్ద సంఖ్యలో యువత పాల్గొని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. కార్యక్రమంలో నేషనల్‌ యూత్‌ అవార్డు గ్రహీత మధు, వార్డు సభ్యులు కమ్మగాని శ్రీకాంత్‌, ఎలమకంటి సతీష్‌, యూత్‌ అధ్యక్షుడు ఎడవెల్లి సోమశేఖర్‌,కార్యదర్శి ఎలమకంటి సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement