రోడ్డు ప్రమాదంలో స్నేహితుల మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో స్నేహితుల మృతి

Feb 1 2026 3:17 AM | Updated on Feb 1 2026 3:17 AM

రోడ్డు ప్రమాదంలో స్నేహితుల మృతి

రోడ్డు ప్రమాదంలో స్నేహితుల మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

మరణంలోనూ వీడని స్నేహబంధం

భువనగిరిటౌన్‌ /పాలకుర్తి టౌన్‌: వారిద్దరు ప్రాణ స్నేహితులు. ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్లేవారు. చివరకు మరణంలోనూ తమ స్నేహబంధం వీడదీయరానిదంటూ రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతిచెందారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన బాతుల రాకేష్‌ (20), పాలకుర్తి మండలం శాతాపురం గ్రామానికి చెందిన గన్నె ఆనంద్‌ (19) ఫొటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు హైదరాబాద్‌లోని రామాంతాపూర్‌లో ఒకే రూంలో ఉంటున్నారు. రాకేష్‌ అమ్మమ్మ ఊరు కూడా శాతాపురం కావడంతో వీరిద్దరు చిన్నప్ప టి నుంచి స్నేహితులయ్యారు. వీరితో పా టు శాతాపురానిక చెందిన మరో స్నేహితు డు సూర్యప్రసాద్‌ కూ డా హైదరాబాద్‌లోనే ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ అ క్కడే మరొక రూంలో ఉంటున్నాడు. జనవరి 30న ఆనంద్‌ పుట్టినరోజు కాగా.. బర్త్‌డే వేడుకలను మే డారంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాకేశ్‌, ఆనంద్‌, సూర్యప్రసాద్‌ కలిసి జనవరి 29న రాత్రి హైదరాబాద్‌ నుంచి బయల్దేరి శా తాపురంలో ఆనంద్‌ బంధువుల వద్ద కారు తీసుకు ని మేడారం వెళ్లారు. అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి శాతాపురం వచ్చి కారును అప్పగించి శుక్రవారం రాత్రి ముగ్గురు కలిసి బైక్‌పై హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఫ్లైఓవర్‌పై బైక్‌ అదుపుతప్పడంతో వెనుక కూర్చు న్న రాకేశ్‌, ఆనంద్‌ బైక్‌ మీద నుంచి ఎగిరి ఫ్లైఓవర్‌ పై నుంచి సర్వీసు రోడ్డుపై పడ్డారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్‌ నడుపుతున్న సూర్యప్రకాశ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల స మాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చే రుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. శనివా రం మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ తెలిపారు. ఆనంద్‌, రాకేశ్‌ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement