ముగిసిన నామినేషన్ల పరిశీలన
● జనగామలో 186, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 114 మంది అభ్యర్థులు
● నేడు అప్పీళ్ల్ల స్వీకరణ,
రేపు తుది జాబితా విడుదల
జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం అధికారులు నామినేషన్లను స్క్రూటినీ ప్ర క్రియ నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులు నామినేషన్లను వేశారు. అభ్యర్థులు ముందస్తుగా ఇబ్బందులు తలెత్తకుండా నా మినేషన్ పత్రాలను ఒకటికి రెండుసార్లు పునఃపరి శీలన చేసి అందించారు. దీంతో నామినేషన్ స్క్రూ టినీలో ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాలేదు. జిల్లాలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ రెండు మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా 300 మంది అభ్యర్థులు మొత్తం 473 నామినేషన్లు వేశారు. ఇందులో అభ్యర్థులు మూడు, నాలుగు సెట్లు దాఖలు చేయగా స్క్రూటినీలో అభ్యర్థికి ఒక్కటి చొప్పున 300 నామినేషన్లను స్వీకరించారు. జనగామలో 186, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 114 మంది అభ్యర్థులు ఉన్నారు. జనగామలో బీజేపీ 54, బీఎస్పీ 6, సీపీఎం 5, కాంగ్రెస్ 107, బీఆర్‌ఎస్ 73, రిజిస్టర్ పార్టీలు 16, స్వతంత్రులు 39 మంది నామినేషన్ వేశారు. అభ్యంతరాల స్వీకరణ, నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన అనంతరం ఎన్నికల బరిలో ఎంతమంది ఉంటారనేది తేలనుంది. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్‌లో 18 వార్డుల గాను 114 మంది అభ్యర్థులు 181 నామినేషన్లు దాఖలు చేశారు. అందులో అత్యధికంగా ఎస్సీ జనరల్ ఉన్న ఒకటవ వార్డులో 15 నామినేషన్లు వేయగా అత్యల్పంగా 7, 14వ వార్డుల్లో 6 చొప్పున నామినేషన్లు వేశారు.


