ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వన్ బాషా సూచించారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియపై శనివారం అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి మున్సిపల్ కమిషనర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు, మాస్టర్ ట్రైనర్లతో గూగుల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నామినేషన్ల పరిశీలన విధానం గురించి కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ల స్క్రూటినీ సమయంలో ప్రతీ దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి, ఎన్నికల నియమావళి ప్రకారం పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్‌ల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. ఆర్‌ఓలు నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేయాలని ఆదేశించారు.
ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా
నిర్వహించాలి
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు ప్రతీ ఇంటిని సందర్శించి వివరాలు సేకరించాలని, ఓటరు జాబితాలోని ఓటర్ల మ్యాపింగ్ చేపట్టాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు తూ రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని 2026 ప్ర క్రియను నిర్దిష్ట గడువులో పూర్తిచేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.


