పకడ్బందీగా రంజాన్ ఏర్పాట్లు
విద్యాసంస్థలకు నేడు సెలవు
జనగామ రూరల్: పవిత్ర రంజాన్ పండుగ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 18నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈద్గాల వద్ద తాగునీటి సౌకర్యం, అవసరమైన చోట్ల నీటిట్యాంకర్‌ను ఏర్పాటుచేయాలని చెప్పారు. మసీదుల వద్ద చెత్త డబ్బాలను ఏర్పాటుచేయడంతో పాటు పరిశుభ్రత చర్యలు ఎప్పటికప్పుడు చేయాలని ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని చెప్పారు. సమావేశంలో జనగామ ఆర్డీఓ గోపి రామ్, స్టేషన్ ఘన్‌పూర్ ఏసీపీ భీమ శర్మ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డాక్టర్ బి విక్రమ్ కుమార్ తదతరులు పాల్గొన్నారు.
లక్ష్యాలను పూర్తిచేయాలి..
వ్యవసాయ యాంత్రీకరణ పథకం లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నా రు. కలెక్టరేట్ నుంచి వ్యవసాయ శాఖ అధికారులతో ఆన్‌లైన్ మీటింగ్ నిర్వహించారు. ఎస్‌ఎంఏఎం పథకంలో భాగంగా జిల్లాకు 2025–26 సంవత్సరానికి గాను వానాకాలంలో రూ.2.73 కోట్ల బడ్జెట్ కేటాయించారన్నారు. ఈ పథకంలో బ్యాటరీ పంపులు, తైవాన్ పంపులు, రోటవేటర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజీ వీల్స్, కలుపు తీసే యంత్రాలు, గడ్డికట్టే యంత్రాలు, పవర్ టిల్లర్ పరికరాలు మంజూరయ్యాయని తెలిపారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ రూరల్: మేడారం మహా జాతర సందర్భంగా నేడు (శుక్రవారం) జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సెలవుకు బదులుగా ఫిబ్రవరి 14వ తేది (రెండో శనివారం) ను పనిదినంగా పరిగణించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.


