రెండోరోజు 146 నామినేషన్లు
జనగామ రూరల్/స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీల్లో రెండోరోజు గురువారం నామినేషన్లు జోరుగా దాఖలు చేశారు. జనగామలో మొదటిరోజు 8 దాఖలు కాగా రెండోరోజు 87 దాఖలయ్యాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో మొదటిరోజు ఒకటి దాఖలు కాగా.. రెండోరోజు 59 దాఖలయ్యాయి. మొత్తంగా జనగామలో 95 స్టేషన్‌ఘన్‌పూర్‌లో 60 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో 155 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు శుక్రవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి.
ప్రత్యేక బృందం ఏర్పాటు
జనగామ మున్సిపల్‌లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రత్యేక బృందాన్ని పురపాలక సంఘం ఏర్పాటు చేసింది. బృందంలోని సభ్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారని కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఫిర్యాదుల కోసం 75695 34326 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు..
జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. జనగామ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆర్డీఓ గోపిరామ్ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించి హెల్ఫ్‌లైన్ సెంటర్ వద్ద అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.
జనగామలో 87,స్టేషన్‌ఘన్‌పూర్‌లో 59
నేడు భారీగా దాఖలయ్యే అవకాశం


