అలరించిన ఆటాపాట
జనగామ: గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో సోమవారం జరిగిన వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మహాత్మాజ్యోతిబాఫూలే, సోషల్ వెల్ఫేర్, ఏకశిల పబ్లిక్ స్కూల్, సాన్‌మారియా, మోడల్ తదితర పాఠశాలలు, గురుకులాలకు చెందిన విద్యార్థులు జాతీయ భావంతో పాటు మన ఆచార, వ్యవహారాలను తమ ప్రదర్శన ద్వారా అద్భుతంగా చూపించారు. అనంతరం చేనేత రుణమాఫీ పథకం కింద 293 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం అందించిన రూ.2,06,25చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించిన చెక్కులను అందించారు. చివరగా పోలీస్, వ్యవసాయం, ఉద్యానవన, జిల్లా గ్రామీణభివృద్ధి, మెప్మా, తదితర శాఖల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్, అదనపు కలెక్టర్‌లు, డీసీపీ పరిశీలించి, నిర్వాహకులను అభినందించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రెవెన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, పింకేశ్ కుమార్, డీసీపీ రాజమ హేంద్రనాయక్, ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మినారాయణ నాయక్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జనగామ ధర్మకంచ మినీ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు
అలరించిన ఆటాపాట


