మద్యం అమ్మితే రూ.10వేల జరిమానా | - | Sakshi
Sakshi News home page

మద్యం అమ్మితే రూ.10వేల జరిమానా

Jan 27 2026 8:10 AM | Updated on Jan 27 2026 8:10 AM

మద్యం అమ్మితే రూ.10వేల జరిమానా

మద్యం అమ్మితే రూ.10వేల జరిమానా

మరిగడిలో మద్యపాన నిషేధం

జనగామ రూరల్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని మరిగడి గ్రామంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని సోమవారం గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానాన్ని ఆమోదించింది. సర్పంచ్‌ కర్రె పరశరాములు అధ్యక్షతన ఉపసర్పంచ్‌ బాల్నే వెంకటరాజు వార్డు సభ్యులు పుట్టా ఎలేందర్‌, బోడ నరేందర్‌,దుబ్బాక స్వాతి, కర్రే కమలాకర్‌, దండు శ్రావణి,కూరాకుల రమేశ్‌, బొల్లి కవిత, ఇట్టమైన అశోక్‌, బాల్నే లోకేశ్వరితో కూడిన పాలకవర్గం గ్రామస్తుల సహకారంతో తీర్మానించారు. ఇక నుంచి గ్రామంలో దుకాణదారులు మద్యం అమ్మకూడదని, ఒకవేళ విక్రయిస్తే రూ.10వేల జరిమానా విధిస్తామని, అమ్మిన వ్యక్తులను పట్టిస్తే రూ.5 వేల నజరానా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

కొడవటూర్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం

బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్‌ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్‌ నీల కవితమురళి తెలిపారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు.. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని గ్రామస్తులు అందరూ కలిసి తీర్మానం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ గంగం దయాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి బృంగి రూపాచైతన్య, అంగన్‌వాడీలు ప్రేమలక్ష్మి, శ్యామల, వీఓఐ మల్లం శోభ, వాణి, ఆశాల అనిత, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అశోక్‌, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement