శ్రీఉమామహేశ్వరుడికి జాతీయజెండా అలంకరణ
జనగామ: గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని పట్టణంలోని గుండ్లగడ్డ శ్రీ ఉమాహేశ్వర ఆలయంలో స్వామికి జాతీయ జెండాతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు ఆలయానికి వచ్చి పూజలతో పాటు దేశభక్తిని చాటుకున్నారు.
ఢిల్లీ వేడుకల్లో చిన్నపెండ్యాల కళాకారుడు
చిల్పూరు: మండలంలోని చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన చిందుయక్షగాన కళాకారుడు గజవెళ్లి మంజునాథ్‌కు ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కింది. కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని నాగపూర్ సౌత్ సెంట్రల్ జోన్ కల్చర్ వారు 20 రోజల క్రితం గణతంత్ర వేడకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం పంపారు. 20 రోజుల రిహార్సల్ తర్వాత సోమవారం ఇండియా గేట్ కల్చరల్ పరేడ్ కర్తవ్య భవన్‌లో కళాప్రదర్శన విజయవంతంగా నిర్వహించారు. ఈ కళా ప్రదర్శనను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పాల్గొని తిలకించారు.
శ్రీఉమామహేశ్వరుడికి జాతీయజెండా అలంకరణ


