ఇప్పగూడెం జాతర ప్రాంగణం పరిశీలన
స్టేషన్‌ఘన్‌పూర్: ఇప్పగూడెం, రంగరాయగూడెం, కోమటిగూడెం, అక్కపెల్లిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని చింతగట్టు శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర ప్రాంగణాన్ని డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ముందుగా జాతర ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాతర కమిటీతో మాట్లాడారు. జాతరలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని, భక్తులకు అసౌకర్యం కలుగకుండా అందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. జాతర కమిటీ చైర్మన్ తోట వెంకన్న, వైస్ చైర్మన్ మ్యాదరబోయిన కరుణాకర్, ఎల్లగౌడ్, కట్టయ్య, సర్పంచ్‌లు రాణిఅనీల్, సోమేశ్వర్ పాల్గొన్నారు.


