గణతంత్ర వేడుకలకు సిద్ధం
జనగామ రూరల్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ధర్మ కంచ స్టేడియంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ శాఖల సమన్వయంతో ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బంది ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారని స్టేడియంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రగతిని తెలిపే స్టాల్స్ ప్రదర్శించనున్నట్లు వెల్ల డించారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్ర శంస పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.
కలెక్టర్‌కు
రాష్ట్రస్థాయి పురస్కారం
జనగామ రూరల్: ఎన్నికల శిక్షణ, సామర్థ్య పెంపు విభాగంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ జిల్లాగా కలెక్టర్ రిజ్వాన్ బాషా అవార్డు అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్రస్థాయి వేడకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ పురస్కారాన్ని అందుకున్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 సంవత్సరానికిగాను ఎన్నికల నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన అధికారుల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి శనివారం ప్రకటించారు. ఇందులో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ‘శిక్షణ, సామర్థ్య పెంపు’ (ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బి ల్డింగ్) విభాగంలో అవార్డు దక్కించుకున్నారు.
ఇన్వెస్టిగేషన్ మార్గదర్శకాల ప్రతుల అందజేత
జనగామ రూరల్: పౌర సరఫరాల శాఖ కేసుల్లో చట్టపరమైన అమలుకు మార్గదర్శకాలను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్ ఎం.స్టిఫెన్ రవీంద్ర విడుదల చేశారు. కాగా ఈ మార్గదర్శకాల ప్రతులను శనివారం పౌరసరఫరాల శాఖ అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అందజేశారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించిన బియ్యం అక్రమ రవాణా, వడ్ల కొనుగోలుకు సంబంధించిన అవకతవతలు, అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లులపై చర్య తీసుకునేందుకు తగిన మార్గదర్శకాలు, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్‌కు సంబంధించిన తగు పత్రాలు, రెవెన్యూ రికవరీ యాక్ట్, కోర్ట్ మానిటరింగ్ సిస్టం మార్గదర్శకాల్లో పొందుపరచడం జరిగిందన్నారు.
నేడు ఏఐసీసీ సెక్రటరీ
విశ్వనాథన్ రాక
జనగామ రూరల్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేడు (సోమవారం) నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. జనగామ మండలం ఓబుల్ కే శపురంలో చేపట్టే ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ రానున్నారు. ఆయనతోపా టు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొననున్నారు.
గణతంత్ర వేడుకలకు సిద్ధం
గణతంత్ర వేడుకలకు సిద్ధం


