ఆ ముగ్గురు స్టూవర్టుపురం దొంగలు | - | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురు స్టూవర్టుపురం దొంగలు

Jan 26 2026 4:56 AM | Updated on Jan 26 2026 4:56 AM

ఆ ముగ్గురు స్టూవర్టుపురం దొంగలు

ఆ ముగ్గురు స్టూవర్టుపురం దొంగలు

ఆ ముగ్గురు స్టూవర్టుపురం దొంగలు

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ప్రస్తు తం ఉన్న గజదొంగ డాక్టర్‌ రాజయ్యకు తోడుగా మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం పేరుతో స్టూవర్టుపు రం దొంగల్లా ఎర్రబెల్లి దయాకర్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వస్తున్నారని ఎ మ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ఘన్‌పూర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏ ర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వా త ఘన్‌పూర్‌లో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, ఘన్‌పూర్‌లో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌, మున్సిపాలిటీ ఏర్పాటు అన్నింటికి తామే కారణం అన్నట్లుగా ప్రజలను త ప్పుదోవ పట్టించేలా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. 2023 ఎన్నికల్లో రాజయ్యకు టికెట్‌ ఇస్తే గెలువడం కష్టమని కేసీఆర్‌, కేటీఆర్‌కు చెప్పింది ఎర్రబెల్లి, పోచంపల్లి, పల్లా రా జేశ్వర్‌రెడ్డిలే అని అన్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు మతిభ్రమించి సభ్యత, సంస్కారం లేకుండా మా ట్లాడుతున్నాడని కడియం విమర్శించారు. టీడీపీని హోల్‌సేల్‌గా కేసీఆర్‌కు అమ్మిన నీచచరిత్ర ఎర్రబెల్లిదని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే అందులోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో దయాకర్‌రావు నీచచరిత్ర తెలిసి రేవంత్‌రెడ్డి.. దగ్గరకు రాని వ్వలేదని ఎద్దేవాచేశారు. కేసీఆర్‌ చుట్టూ బొచ్చుకుక్కలా తిరిగి.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి వందల కోట్లు ఆస్తులు సంపాదించుకున్నాడని, కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చుపెట్టిన పల్లా.. కేసీఆర్‌ కుటుంబాన్ని నాశనం చేశాడని విమర్శించారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు పోచంపల్లికి ఎక్కడ నుంచి వచ్చాయని, కేటీఆర్‌, సంతోష్‌ రావులకు పోచంపల్లి బినామీ అన్నారు. గజదొంగకు తోడుగా వస్తున్న స్టూవర్టుపురం దొంగల విషయంలో ఘన్‌పూర్‌ ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు జూలు కుంట్ల శిరీష్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాంబాబు, నాయకులు నరేందర్‌రెడ్డి, బెలిదె వెంకన్న, అంబటి కిషన్‌రాజు, నూకల ఐలయ్య, తోట సత్యం, నీల గట్టయ్య, పోశాల కృష్ణపటేల్‌, నర్సింహులు, చింత ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement