ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలి
స్టేషన్‌ఘన్‌పూర్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని జనగామ డిపో మేనేజర్ స్వాతి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సర్వీలసులను ఆదివారం స్థానిక బస్టాండ్‌లో డీఎం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మేడారం జాతరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలన్నారు. భక్తుల డిమాండ్‌కు తగినట్లుగా బస్సు సర్వీసులను నడిపిస్తామని, సుశిక్షితులైన డ్రైవర్లు ఉంటారని తెలిపారు. ఘన్‌పూర్ నుంచి మేడారానికి పెద్దలకు రూ.300, పిల్లలకు రూ.200 టికెట్ చార్జ్ నిర్ణయించినట్లు తెలిపారు. మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐ జి.వేణు, ఆర్టీసీ జనగామ డిపో అసిస్టెంట్ మేనేజర్ హుస్సేన్, సూపరింటెండెంట్ నారాయణ, సమ్మయ్య, ఘన్‌పూర్ బస్టాండ్ కంట్రోలర్ ఈఎస్ బాబు, సురేందర్, రమేష్, శ్రీనివాస్, స్వామి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ప్రెస్టన్ గ్రౌండ్ నుంచి..
జనగామ రూరల్: జనగామ నుంచి మేడారం వెళ్లే భక్తుల కోసం ప్రెస్టన్ గ్రౌండ్స్ నుంచి బస్సు సర్వీసులను నడిపించనున్నారు. ఈమేరకు అదనపు కలెక్టర్ బెన్‌షా లోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి డిపో మేనేజర్ స్వాతి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉద్యోగులు ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.
జనగామ డిపో మేనేజర్ స్వాతి
ఘన్‌పూర్ నుంచి మేడారానికి
బస్సు సర్వీసుల ప్రారంభం


