ఓటు హక్కు ఎంతో విలువైనది | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు ఎంతో విలువైనది

Jan 26 2026 4:56 AM | Updated on Jan 26 2026 4:56 AM

ఓటు హక్కు ఎంతో విలువైనది

ఓటు హక్కు ఎంతో విలువైనది

జనగామ రూరల్‌: ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైనదని తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌ అన్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరెట్‌లో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ సందేశం వినిపించారు. అనంతరం బెన్‌ షాలోమ్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాంటి ప్రలో భాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పద్దెనిమిది ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావాలని సూ చించారు. రాజ్యాంగం ద్వారా వచ్చిన ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదిగా నిలుస్తోందని గుర్తు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు. ప్రతీసారి వినూత్న పద్ధుతుల్లో ప్రజలను చైతన్యపరుస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే ఈసారి మై ఇండియా – మై ఓటు నినాదంతో ఓటర్లను చైతన్య పరుస్తోందని అన్నా రు. ఈ సందర్భంగా ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీనియర్‌ సిటిజన్లు, కొత్తగా నమోదైన యువ ఓటర్లకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరాం, ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement