పారదర్శకంగా యూరియా సరఫరా | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా యూరియా సరఫరా

Jan 26 2026 4:56 AM | Updated on Jan 26 2026 4:56 AM

పారదర్శకంగా యూరియా సరఫరా

పారదర్శకంగా యూరియా సరఫరా

పారదర్శకంగా యూరియా సరఫరా

జనగామ రూరల్‌: యూరియా సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా రూపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూ రియా బుకింగ్‌ యాప్‌ జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ తె లిపారు. శనివారం కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న అగ్రోస్‌ రైతు సేవాకేంద్రాన్ని సందర్శించి యూరియా నిల్వలు, యాప్‌ ద్వారా జరిగిన బుకింగ్స్‌, విక్రయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో యూ రియా బుకింగ్‌ యాప్‌ అమలుకు ముందు రోజు వారీ సగటు యూరియా విక్రయాలు 3,000 నుంచి 3,500 సంచుల వరకు మాత్రమే ఉండేవని, యాప్‌ అమలులోకి వచ్చిన తర్వాత 6,000 నుంచి 7,000 సంచుల వరకు విక్రయాలు జరుగుతున్నాయని కలెక్టర్‌ తెలిపారు. యూరియా బుకింగ్‌ యాప్‌కు జిల్లాలో రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఇప్పటివరకు 53,946 మంది రైతులు యాప్‌ ద్వారా యూరియా బుక్‌ చేసుకున్నారని, మొత్తం 62,398 బుకింగ్స్‌ నమోదయ్యాయని వీటిలో 2,01,012 యూరియా సంచులు రైతులకు విజయవంతంగా విక్రయించినట్లు వెల్లడించారు. అదే విధంగా, గత 15 రోజులుగా జిల్లాలో యూరియా నిల్వలు నిరంతరం 25,000 సంచులకుపైగా ఉన్నాయని తెలిపా రు. రైతులకు యాప్‌ వినియోగంపై మరింత అవగాహన కల్పిస్తూ, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement