మద్యం మత్తులోనే గొడవ.. | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులోనే గొడవ..

Jan 25 2026 7:18 AM | Updated on Jan 25 2026 7:18 AM

మద్యం మత్తులోనే గొడవ..

మద్యం మత్తులోనే గొడవ..

జనగామ నియోజకవర్గ కాంగ్రెస్‌

ఇన్‌చార్జ్‌ కొమ్మూరి

జనగామ: పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసేందుకు వ చ్చిన మంత్రి సీతక్క పర్యటనను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనుచరవర్గానికి మ ద్యం పోయించి గొడవకు దిగారని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొమ్మూరి మాట్లాడారు. పెంబర్తి జంక్షన్‌ వద్ద మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించే సమయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రోగ్రాంలో అంతా తానైనట్టుగా వ్యవహరిస్తూ, అక్కడ నుంచే గొవకు తెరలేపాడని ఆరోపించారు. మంత్రి కార్యక్రమంలో ఎమ్మెల్యే సభ్యత, సంస్కారం మరచి వ్యవహారించారన్నారు. రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు రాకేష్‌పై ఎమ్మెల్యే తిట్టారని, దీనిపై డీసీపీ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పదవి పూర్తయ్యే వరకు దొంగ ఓట్లపై పోరాడుతామన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యుడు లకావత్‌ లక్ష్మీనారాయణ నాయక్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వేముల సత్యనారాయణరెడ్డి, జనగామ వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌, కంచె రాములు, డాక్టర్‌ రాజమౌళి, కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, లింగాల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement