ట్రిప్పులు తగ్గించారు.. | - | Sakshi
Sakshi News home page

ట్రిప్పులు తగ్గించారు..

Jan 23 2026 7:03 AM | Updated on Jan 23 2026 7:03 AM

ట్రిప

ట్రిప్పులు తగ్గించారు..

ట్రిప్పులు తగ్గించారు.. గతంతో పోలిస్తే సమస్యలు లేవు.. ఆర్టీసీ అధికారులతో మాట్లాడుతా.. బస్సుల ఇబ్బంది లేదు

రెండేళ్ల క్రితం ఉన్న ఆర్టీసీ బస్సు ట్రిప్పులు, రూట్లను ప్రస్తుతం తగ్గించారు. బడి పిల్లల అవసరమున్న చోట ఆపడం లేదు. పెంబర్తి తదితర ప్రాంతాలు, స్కూల్స్‌ వద్ద ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది. బడుల సమయానుకూలంగా బస్సు సర్వీసులను నడిపించాలి. ఈ విషయమై రాష్ట్రస్థాయి ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్తా.

– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే,జనగామ

నియోజకవర్గంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం రోడ్లు, ఆర్టీసీ బస్సుల విషయమై పెద్దగా సమస్య లేదు. నేను మొదటి నుంచి విద్యారంగానికి పెద్దపీట వేస్తాను. విద్యార్థులకు రవాణా విషయమై వాస్తవంగా సమస్య ఉంటే ఆర్టీసీ అధికారులతో చర్చించి పరిష్కరించేలా కృషి చేస్తా.

–కడియం శ్రీహరి, ఎమ్మెల్యే, స్టేషన్‌ఘన్‌పూర్‌

గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బంది కలుగనివ్వకుండా చూస్తా.. వారి భద్రత, చదువు దృష్టిలో పెట్టుకొని, రాజీవ్‌ చౌరస్తా సమీపంలో విద్యార్థులు ప్రయాణించే బస్సులను అపాడానికి ఆర్టీసీ ఆధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటాం.

– యశస్వినిరెడ్డి, ఎమ్మెల్యే, పాలకుర్తి

జిల్లాలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంతో పాటు తిరుగు ప్రయాణంలో బస్సు సమస్య లేదు. విద్యార్థులు వెళ్లు స్టేజీ నుంచి కిలోమీటరు నుంచి కిలోమీటరున్నర వరకు కనెక్టివిటీ లేని సమయంలో అక్కడ వరకే ఎండ్‌ పాయింట్‌ ఉంటుంది. మా వద్ద ఒక్క దరఖాస్తు పెండింగ్‌ లేదు.

– స్వాతి, మేనేజర్‌, జనగామ ఆర్టీసీ డిపో

ట్రిప్పులు తగ్గించారు..
1
1/3

ట్రిప్పులు తగ్గించారు..

ట్రిప్పులు తగ్గించారు..
2
2/3

ట్రిప్పులు తగ్గించారు..

ట్రిప్పులు తగ్గించారు..
3
3/3

ట్రిప్పులు తగ్గించారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement