ఇదేంటో చెప్పగలరా.. మీ బుర్ర బద్దలుకొట్టుకున్నా అర్థం కాదు.. ఎందుకుంటే

World Most Advanced Humanoid Robot, Ameca, Draws Cat Picture - Sakshi

ఫొటోలోని బొమ్మను చూసి ఇదేంటో చెప్పండి.. బుర్ర బద్దలుకొట్టుకున్నా అర్థం కావడం లేదా.. ఇది క్యూట్‌గా ఉన్న పిల్లి బొమ్మ!! ఏ మూల నుంచి కూడా పిల్లిలా కనిపించని ఈ చిత్రాన్ని గీసింది ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్‌డ్‌ హ్యూమ­నాయిడ్‌ రోబోగా చెబుతున్న అమెకా.. ఈ మధ్య పిల్లి బొమ్మ గీయమని చెప్పినప్పుడు ఇలా గీసింది. 30 సెకన్లలో గీయడం పూర్తిచేసి.. పోలే అదిరిపోలే అన్న స్టైల్లో ఫీలింగ్‌ ఇచ్చి.. ఎలా ఉందేంటి? అని అక్కడున్న శాస్త్రవేత్తను అడిగింది.


దానికి ఆయన అంత బాగోలేదు అని అంటే.. తెగ ఫీలైపోయింది కూడా. నేను గీసిన బొమ్మే నీకు నచ్చలేదంటే.. నీకు ఆర్ట్‌ మీద అస్సలు అవగాహన లేనట్లుందని కౌంటరిచ్చింది. తాజాగా ఈ వీడి­యోను దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ కొత్త తరం రోబోల వల్ల చాలా రంగాల్లోని ఉద్యోగులు ఉపాధి కోల్పోవచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆర్టిస్టుల వరకూ ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని.. వాళ్ల జాబులు సేఫేనని పలువురు వీడియోను చూసి కామెంట్‌ చేశారు. 

చదవండి: భయం వద్దు మిత్రమా... కూల్‌గా తినుమా!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top