అమెరికాలో మ‌రోసారి కాల్పుల క‌ల‌క‌లం.. ఇద్దరు మృతి | Us Mass Shooting At Ohio Nightclub | Sakshi
Sakshi News home page

అమెరికాలో మ‌రోసారి కాల్పుల క‌ల‌క‌లం.. ఇద్దరు మృతి

Jun 14 2024 4:29 PM | Updated on Jun 14 2024 5:55 PM

Us Mass Shooting At Ohio Nightclub

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓహియో రాష్ట్రంలోని ఓ నైట్‌ క్లబ్‌లో గుర్తు తెలియని అంగతకులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ పోలీస్ గ్రెగ్ బోడ్కర్ ప్రకారం..అవలోన్ డాన్స్ క్లబ్‌లో తెల్లవారుజామున సుమారు 1:45 గంటలకు క్లబ్‌కు వచ్చిన వారి మధ్య వాగ్వాదం తలెత్తిందని, దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన బాధితుల పరిస్థితి విషయం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ కాల్పులు జరిపింది ఎవరు? అందుకు కారణాలు. నిందితులు వివరాల గురించి స్పష్టత రావాల్సి ఉండగా.. మరణించిన బాధితుల వయస్సు 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని స్థానిక పోలీసులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement