బ్రిటిష్‌ నౌకపై హౌతీల దాడి | Sakshi
Sakshi News home page

బ్రిటిష్‌ నౌకపై హౌతీల దాడి

Published Sun, Jan 28 2024 5:27 AM

Houthi Rebels Burn British Oil Tanker With Direct Missile Hit In Gulf Of Aden - Sakshi

జెరూసలేం: యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ రెచి్చపోయారు. బ్రిటిష్‌ చమురు ట్యాంకర్‌తోపాటు మొట్టమొదటిసారిగా అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ కారీ్నపైకి క్షిపణులను ప్రయోగించారు. బ్రిటిష్‌ చమురు నౌక మంటల్లో చిక్కుకోగా, అందులోని 22 మంది భారతీయ సిబ్బందిని కాపాడేందుకు భారత నావికా దళం ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం అక్కడికి హుటాహుటిన తరలి వెళ్లింది.

ఈ ఘటన శుక్రవారం రాత్రి ఎర్ర సముద్రంలోని ఏడెన్‌ సింధులో చోటుచేసుకుంది. బ్రిటిష్‌ చమురు నౌక ఎంవీ మర్లిన్‌ లువాండా లక్ష్యంగా హౌతీలు ప్రయోగించిన క్షిపణితో నౌకలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. విపత్తు సమాచారం అందుకున్న భారత నేవీకి చెందిన డె్రస్టాయర్‌ ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం అక్కడికి చేరుకుంది. నౌకలో మంటలను ఆర్పి, సిబ్బందిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

నౌకలోని సిబ్బందిలో 22 మంది భారతీయులతోపాటు ఒక బంగ్లాదేశీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని కలగలేదని సమాచారం. ఇలా ఉండగా, ఏడెన్‌ సింధు శాఖలో పయనించే చమురు నౌకలే లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారుల దాడులు పెరిగిన నేపథ్యంలో అమెరికాకు చెందిన యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ కార్నీని మోహరించింది. ఈ నౌకపైకి శుక్రవారం హౌతీలు మొట్టమొదటిసారిగా క్షిపణిని ప్రయోగించారు. దీనిని మధ్యలోనే కూల్చివేసినట్లు అమెరికా నేవీ ప్రకటించింది.   
 

Advertisement
Advertisement