యూనియన్ బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకోవాలి
లీడ్ బ్యాంకు మేనేజర్ రత్న మహిపాల్ రెడ్డి
పొన్నూరు: స్థానిక యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో పొన్నూరులోని అంబేద్కర్ భవన్‌లో బుధవారం ఆర్థిక సాక్షరత వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సభలో ముఖ్యఅతిథిగా లీడ్ బ్యాంక్ మేనేజర్ రత్న మహిపాల్ రెడ్డి పాల్గొని యూనియన్ బ్యాంకు అందిస్తున్న సేవలను వివరించారు. పొదుపు సంఘాల మహిళల కోసం అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిపాజిట్లతో కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ దేవరపల్లి మణి భూషణ్, ఆర్డీవో ప్రియదర్శిని, కమ్యూనిటీ ఆర్గనైజర్లు విశ్వనాథ్, లక్ష్మీ, సుగుణ, ఆర్‌పీలు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ఖాతాదారులు పాల్గొన్నారు.


