పట్టుచీరలో మెరిసిన మాధురి, ఆ చీర ధర ఎంతో తెలుసా?

Madhuri Dixit GraceTraditional Bandhej Saree Worth Whopping Rs 75K - Sakshi

వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందం ఆమె. వయసుతో పాటు అందాన్ని కూడా  పెంచుకున్న బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ మాధురీ దీక్షిత్ లివింగ్ లెజెండ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాంప్రదాయ దుస్తులలో, ముఖ్యంగా చీరలలో మెరిసిపోతూ ఉంటుంది ఈ ఎవర్‌గ్రీన్ దివా.   పాప్‌ ఆఫ్‌ పింక్‌,  ఏ డ్యాష్‌ ఆఫ్‌ గ్రేస్‌ అంటూ  తన అందాన్ని పొగడకుండానే తెగ పొగిడేసుకుంది. 

తన  బ్యూటిఫుల్‌  స్మైల్‌తో పాటు, చక్కటి డ్యాన్స్‌తో అందరినీ మెస్మరైజ్‌ చేస్తోంది. ఆమె అందమైన ఫోటోలను తన సోషల్ మీడియాలో  ఫ్యాన్స్‌తో పంచుకుంటూ  ఉంటుంది. తాజాగా మాధు దీక్షిత్  గుజరాత్‌  బంధాని (బంధేజీ)  పట్టుచీరలో మెరిసిపోతున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

బ్రైట్‌ కలర్‌ ఆరు గజాల చీరలో మాధురి లుక్‌ అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్‌.  పింక్‌, పర్పుల్‌ కాంబినేషన్‌లో  బంగారు రంగు అంచు చీరలో అద్భుతంగా కనిపించింది.   పర్పుల్ హ్యూడ్ బ్లౌజ్‌, చక్కటి మేకప్, సాధారణ హెయిర్ బన్, యాంటిక్‌ జ్యూయల్లరీతో మరింత ఫ్యాషన్‌ను జోడించింది.   దీంతో ఈ చీర ఎంత అనే  ఆసక్తి నెలకొంది. గ్రాండ్‌ పీస్‌ ధర 75వేల రూపాయలట. కాగా జవనరి 22న అయోధ్యలో జరిగిన రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి భర్త శ్రీరామ్‌ తో కలిసి హజరైంది. 

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top