ఈ టీత్‌ క్లీనర్‌ ఉంటే..ముత్యాల్లాంటి పలువరుస మీ సొంతం! | Electric Sonic Dental Calculus Plaque Remover Tool Kit | Sakshi
Sakshi News home page

ఈ టీత్‌ క్లీనర్‌ ఉంటే..ముత్యాల్లాంటి పలువరుస మీ సొంతం!

Published Sun, Jan 7 2024 1:07 PM | Last Updated on Sun, Jan 7 2024 1:21 PM

Electric Sonic Dental Calculus Plaque Remover Tool Kit - Sakshi

ముత్యాల్లాంటి పలువరుస ముఖానికి ఎనలేని అందాన్ని తీసుకొస్తుంది. నవ్వినా.. మాట కలిపినా.. పలువరుసే ఎదుటివాళ్లను ఆకర్షిస్తుంది. అలా పళ్లు తెల్లగా మెరిసిపోవాలంటే.. నోటి దుర్వాసన మాయం కావాలంటే వెంటనే ఈ ప్రొఫెషనల్‌ టీత్‌ క్లీనర్‌ని తెచ్చేసుకోండి. మరీ ముఖ్యంగా స్మోకింగ్, వైన్, కాఫీ అలవాటున్నవాళ్లు దీంతో ఉపశమనం పొందొచ్చు. 

  • ఈ డెంటల్‌ కాలిక్యులస్‌ రిమూవల్‌ టూల్‌.. సాఫ్ట్, నార్మల్, మీడియం, స్ట్రాంగ్, సూపర్‌ స్ట్రాంగ్‌ వంటి ఐదు అడ్జస్టబుల్‌ మోడ్స్‌తో పని చేస్తుంది. ఇది చిగుళ్ల ఇరుకుల్లో, దంతాల చుట్టూ పేరుకున్న గారను పూర్తిగా తొలగిస్తుంది.
  • ఈ మెషిన్‌ కారణంగా పళ్లకు, పళ్ల మీది ఎనామిల్‌ పొరకు ఎలాంటి నష్టం వాటిల్లదు. దీనికి అడాప్టర్‌తో పాటు.. ల్యాప్‌టాప్‌తోనైనా, పవర్‌ బ్యాంక్‌తోనైనా, కారులోనైనా చార్జింగ్‌ పెట్టుకోవచ్చు.
  • సీ టైప్‌ చార్జర్‌ అనువైనది. లోపలికున్న దంతాలు, పై పళ్ల లోపలి భాగాలు స్పష్టంగా కనిపించడానికి ప్రత్యేకమైన డెంటల్‌ మిర్రర్‌ లభిస్తుంది. దీని హెడ్‌కి ఎల్‌ఈడీ లైట్‌ అమర్చి ఉండటంతో పళ్లను తేలికగా శుభ్రం చేసుకోవచ్చు. దీని ధర సుమారుగా 155 డాలర్లు. అంటే 12,893 రూపాయలన్న మాట. ఇతర మోడ్స్, ఆప్షన్స్‌ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. 

(చదవండి: పక్షులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా? అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement