రాజేంద్రనగర్‌లో ఆటో డ్రైవర్‌ కిడ్నాప్‌ కలకలం

Police Arrest Victims In Auto Driver Kidnap Case In Rajendra Nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో ఆటో డ్రైవర్‌ కిడ్నాప్‌ కలకలం రేపింది. వివరాలు.. మెహదీపట్నంకు చెందిన ఆటోడ్రైవర్‌ నదీమ్‌ను కొందరు దుండగులు కత్తితో బెదిరించి కిడ్నాప్‌ చేశారు. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన ఎస్వోటీ పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల ఆధారంగా కిడ్నాపర్ల ఆట కట్టించారు. చింతల్‌మెట్‌ ప్రాంతంలో ఒక గదిలో నదీమ్‌ను బంధించినట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని  విడిపించారు. అనంతరం నదీమ్‌ను కిడ్నాప్‌ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top