నాగోలు: మద్యం తాగుతూ.. గొడవ పడుతూ యువతి హల్‌చల్‌ | Drunk Man And Woman Held For Abusing Morning Walkers In Argument For Drinking Alcohol In Public, Video Viral | Sakshi
Sakshi News home page

LB Nagar Road Drunk Duo Video: మద్యం తాగుతూ.. గొడవ పడుతూ యువతి హల్‌చల్‌

Published Sat, May 25 2024 7:00 AM

Man And Woman Drinking Alcohol at Public Place in Hyderabad

నాగోలు: జనావాసాల మధ్య..ఉదయం 6 గంటలకే మద్యం తాగుతూ ఓ యువతి, యువకుడు హల్‌చల్‌ చేశారు. నాగోలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పల్‌ పీర్జాదిగూడకు చెందిన అలెక్స్‌ బోడిచెర్ల (25) ఓ యువతితో కలిసి ఫతుల్లాగూడ 100 ఫీట్‌ రోడ్డుకు కారులో వచ్చారు.

కారు ఆపి బీర్లు, సిగరెట్లు తాగుతూ హల్‌చల్‌ చేశారు. ఇదే సమయంలో ఆ రహదారిపై మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన వాకర్స్‌ కలుగజేసుకుని వారిని హెచ్చరించారు. ఇలా బహిరంగంగా మద్యం తాగుతూ గొడవలు చేయొద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో యువతీయువకులు ఇద్దరు వారితో వాగ్వాదానికి దిగి గొడవ పెట్టుకున్నారు.

వాకర్స్‌లో ఒకరు ఫోన్‌ ద్వారా పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా యువతి అతని వద్ద నుండి ఫోను లాక్కోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటనను కొందరు వాకర్స్‌ వీడియోలు తీయగా వైరల్‌ అయ్యాయి. ఈ మేరకు పోలీసులు రోడ్డుపై  మద్యం మత్తులో వీరంగం సృష్టించిన యువతి, యువకుడిని గుర్తించి అరెస్టు చేశారు. .  కాగా వీరిద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు అని తెలిసింది.

బిర్రుగా బీరు ఏస్తున్న జంట

 

Advertisement
 
Advertisement
 
Advertisement