మద్యం మత్తులో సినీ కార్మికుడి హత్య  | Filmmaker murder in Jubilee Hills | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో సినీ కార్మికుడి హత్య 

Apr 1 2024 8:04 AM | Updated on Apr 1 2024 8:04 AM

Filmmaker murder in Jubilee Hills - Sakshi

హైదరాబాద్‌: మద్యం మత్తులో జరిగిన గొడవలో స్నేహితుడిని దారుణంగా పొడిచి చంపిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. పంజగుట్ట వెంకటరమణ కాలనీలో నివసించే జె.మునిరాజు (28) సినీ పరిశ్రమలో సెట్‌ వర్క్‌ చేస్తుంటాడు. ఆయనకు 2012లో వివాహమైంది. మూడేళ్లుగా కృష్ణానగర్‌ ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో తన మిత్రుడితో కలిసి జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌–5లోని అన్నపూర్ణ స్టూడియో పెట్రోల్‌ బంకు సమీపంలో మద్యం తాగుతున్నారు.

ఈ క్రమంలో స్నేహితుడితో గొడవ జరిగింది. దీంతో బీరు బాటిల్‌ను పగులగొట్టిన స్నేహితుడు.. మునిరాజును పొత్తి కడుపులో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. హత్యలో ఒక్కరే పాల్గొన్నట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. హత్య చేసింది ఎవరనేది ఇంకా తెలియరాలేదని, గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement