Financial deadlines: మార్చిలో ముఖ్యమైన డెడ్‌లైన్లు..

Pan Aadhaar Linkage Important Financial Deadlines In March 2023 - Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ఈ మార్చి 31తో ముగుస్తుంది. ఆర్థికపరంగా ఈ మార్చి నెల ముగిసేలోపు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. పాన్- ఆధార్ లింక్, ముందస్తు పన్ను చెల్లింపు, పన్ను ఆదా చేసే పెట్టుబడులు, ప్రధానమంత్రి వయా వందన యోజన దరఖాస్తుకు మార్చిలో గడువులు ముగుస్తాయి.

ఇదీ చదవండి: వాహనదారులకు షాక్‌! హైవే ఎక్కితే బాదుడే.. పెరగనున్న టోల్‌ చార్జీలు!

పాన్-ఆధార్ కార్డ్‌ లింక్
మార్చి 31లోపు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ఆధార్‌తో లింక్ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంతకు ముందు కూడా పాన్-ఆధార్ లింక్ చేయడానికి గడువును చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతం రూ. 1,000 పెనాల్టీ చెల్లించి లింక్ చేసుకోవాలి. ప్రస్తుత గడువు తప్పితే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్‌ పని చేయదని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది.

ముందస్తు పన్ను చెల్లింపు
ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ముందస్తు పన్ను చెల్లింపు చివరి వాయిదా చెల్లింపునకు చివరి తేదీ మార్చి 15. ముందస్తు పన్ను చెల్లింపులో ఏదైనా డిఫాల్ట్ అయితే పన్ను చెల్లింపుదారు సంబంధిత పెనాల్టీలను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. టీడీఎస్‌ మినహాయించిన తర్వాత రూ.10వేలు లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుందని అంచనా ఉన్న వ్యక్తి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ముందస్తు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

పన్ను ఆదా చేసే పెట్టుబడులు
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా చేసే పెట్టుబడులకు మార్చి 31 చివరి తేదీ. పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి, ట్యాక్స్‌ను ఆదా చేయడానికి ఈ పన్ను ప్రణాళిక సహాయపడుతుంది. పన్ను చెల్లింపుదారులు గణనీయమైన మొత్తంలో పన్ను ఆదా చేసుకోవడానికి అందుబాటులో ఉన్న పన్ను ఆదా అవకాశాలను ఉపయోగించుకోవచ్చు.

ప్రధాన మంత్రి వయ వందన యోజన
ఇది సీనియర్ సిటిజన్లకు భద్రతను అందించే బీమా పాలసీ కమ్ పెన్షన్ పథకం. ఈ పథకాన్ని భారతీయ బీమా సంస్థ అందిస్తోంది. ఇందులో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మార్చి 31 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంపై 10 సంవత్సరాలకు ఏటా 7.4 శాతం వడ్డీ వస్తుంది. నెలవారీ, త్రైమాసికం, లేదా వార్షిక ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు.

ఇదీ చదవండి: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్‌! రూ.295 కట్‌ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి..

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top