ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్‌! రూ.295 కట్‌ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి..

Amount Deducted From Your Sbi Saving Account Check Why - Sakshi

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ).. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది బ్రాంచ్‌లు ఉన్న ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఖాతాదారులు ఉన్నారు. రకరకాల సేవల నిమిత్తం బ్యాంక్‌ పలు చార్జీల కింద కస్టమర్ల ఖాతాల నుంచి డబ్బులు కట్‌ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి డబ్బులు ఎందుకు కట్‌ అవుతున్నాయో తెలియక చాలా మంది మథనపడుతుంటారు.

స్టేట్‌ బ్యాంకు ఇటీవల తమ ఖాతాల నుంచి రూ.295 కట్ చేసిందని, అది తిరిగి జమ కాలేదని చాలా మంది కస్టమర్లు చెబుతున్నారు. ఆ మొత్తం ఎందుకు కట్‌ చేశారో తెలియక తికమకపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ డబ్బు కట్‌ అవడానికి గల కారణం ఇక్కడ తెలుసుకోండి...

నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్‌ఏసీహెచ్‌) సేవల కోసం కస్టమర్ల అకౌంట్ల నుంచి ఆ డబ్బు కట్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఖాతాదారుల అకౌంట్ల నుంచి ఈఎంఐల ఆటోమేటిక్ చెల్లింపు కోసం ఎన్‌ఏసీహెచ్‌ ను ఉపయోగిస్తున్నారు. మీరు ఈఎంఐపై ఏదైనా కొనుగోలు చేసినా లేదా రుణం తీసుకున్నా నిర్ణీత తేదీలో మీ సేవింగ్ ఖాతా నుంచి ఈఎంఐ మొత్తం ఆటోమేటిక్‌గా కట్‌అవుతుంది. కాబట్టి గడువు తేదీకి ఒక రోజు ముందుగానే మీరు మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్‌ ఉంచుకోవాలి. ఉదాహరణకు ప్రతి నెల 5వ తేదీన కట్‌ అవుతుందనుకుంటే 4వ తేదీ నుంచి ఆ మొత్తం మీ ఖాతాలో ఉండాలి.

ఇదీ చదవండి: ఓయో ఫౌండర్‌ రితేష్‌ అగర్వాల్‌ పెళ్లి.. ఆహ్వానితుల్లో అత్యంత ప్రముఖులు! ఎవరెవరు వస్తున్నారో తెలుసా?

ఒక వేళ ఈఎంఐ ఆటోమేటిక్‌గా కట్‌ కాకపోయినా, ఈఎంఐకి తగినంత మొత్తం మీ ఖాతాలో లేకపోయినా రూ.295 పెనాల్టీ కింద కట్‌ అవుతుంది. ఇది కొన్నిసార్లు ఒకే సారి కాకుండా కొన్ని నెలల పాటు పెనాల్టీని కూడబెట్టి ఆపై పూర్తిగా కట్‌ కావచ్చు. 

మీరు ఈఎంఐ మొత్తానికి తగినంత బ్యాలెన్స్ అకౌంట్‌లో ఉంచడంలో విఫలమైతే బ్యాంక్ రూ. 250 పెనాల్టీ విధిస్తుంది. దీనికి 18 శాతం జీఎస్టీ అంటే రూ.45 అదనం. మొత్తంగా రూ.295 మీ ఖాతా నుంచి కట్‌ అవుతుందన్నమాట. ఇలా కట్‌ కాకూడదంటే మీరు ఈఎంఐకి సరిపడా మొత్తాన్ని గడవు తేదీకి ఒక రోజు ముందుగానే మీ అకౌంట్‌లో ఉంచాలని గుర్తుంచుకోండి.

ఇదీ చదవండి: Samsung Galaxy Z Fold 5: మడత అంటే ఇదీ.. పర్ఫెక్షన్‌ అంటే ఇదీ!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top