12 కోట్లకు బీఎస్‌ఈ ఇన్వెస్టర్లు | Bse Adds 1 Crore Investors Just 148 Days To Reach 12 Crore | Sakshi
Sakshi News home page

12 కోట్లకు బీఎస్‌ఈ ఇన్వెస్టర్లు

Dec 14 2022 10:01 AM | Updated on Dec 14 2022 10:11 AM

Bse Adds 1 Crore Investors Just 148 Days To Reach 12 Crore - Sakshi

న్యూఢిల్లీ: స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం బీఎస్‌ఈలో రిజిస్టరైన ఇన్వెస్టర్ల ఖాతాలు గత 148 రోజుల్లో కోటి జత కలిశాయి. దీంతో ఎక్సే్ఛంజీలో రిజిస్టర్డ్‌ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 12 కోట్ల మైలురాయిని తాకింది. జులై 18 నుంచి డిసెంబర్‌ 13 మధ్య కాలంలో కోటి ఖాతాలు కొత్తగా జ త కలసినట్లు బీఎస్‌ఈ వెల్లడించింది. కాగా.. ఇంతక్రితం 11 కోట్ల ఇన్వెస్టర్ల సంఖ్య చేరేందుకు 124 రోజులు తీసుకోగా.. 10 కోట్లకు 91 రోజులు, 9 కోట్లకు 85 రోజులు, 8 కోట్లకు 107 రోజులు పట్టడం గమనించదగ్గ అంశం!

యూనిట్‌ క్లయింట్‌ కోడ్‌(యూసీసీ) ఆధారంగా 2022 డిసెంబర్‌ 13కల్లా రిజిస్టరైన ఇన్వెస్టర్లు 12 కోట్లకు చేరినట్లు బీఎస్‌ఈ తెలియజేసింది. వీరిలో 42 శాతంమంది 30–40 వయ సువారుకాగా.. 23 శాతంమంది 20–30 వయసును కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇక 40–50 వయసు వ్యక్తుల వాటా 11 శాతంగా వెల్లడించింది. ఇన్వెస్టర్ల సంఖ్యలో 20 శాతం మహారాష్ట్రకు చెందగా.. 10 శాతంతో గుజరాత్, 9 శాతంతో యూపీ, 6 శాతంతో రాజస్తాన్, తమిళనాడు తదుపరి ర్యాంకులలో నిలుస్తున్నాయి.

చదవండి:  లేడీ బాస్‌ సర్‌ప్రైజ్‌ బోనస్‌ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement