
సాక్షి,తాడేపల్లి: మాజీ ఎమ్మెల్యే, రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి జయప్రకాశ్ మరణంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జై ఆంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ఆయన కీలకపాత్ర పోషించారని వైయస్ జగన్ గుర్తు చేసుకున్నారు.
కాగా, గత కొంత కాలంగా అస్వస్థతగా ఉన్న అడుసుమిల్లి జయప్రకాశ్ హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం విజయవాడలోని మొగల్రాజపురంలో జరగనున్నాయి.
మాజీ శాసనసభ్యులు, రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి జయప్రకాశ్ మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు @ysjagan సంతాపం వ్యక్తం చేశారు.
జై ఆంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ఆయన కీలకపాత్ర పోషించారని వైయస్ జగన్ గుర్తు చేసుకున్నారు. జయప్రకాశ్ కుటుంబ స…— YSR Congress Party (@YSRCParty) September 20, 2024