గురివింద ప్రయాసే 

Travel safely with insurance coverage - Sakshi

బీమా రక్షణతో భద్రంగా ప్రవాసాంధ్రులు  

2.55 లక్షల మందికి ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్‌ సేవలు 

కరోనా, ఉక్రెయిన్‌ యుద్ధం వేళ తక్షణమే స్పందన 

మాతృభూమికి సురక్షితంగా ప్రవాసుల తరలింపు 

50 వేల మంది వలస కార్మికులు క్షేమంగా రాష్ట్రానికి  

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టను మసకబార్చడమే లక్ష్యంగా పొరుగు రాష్ట్రం నుంచి రాళ్లేస్తున్న రాజ గురివింద ప్రవాసాంధ్రులకు బీమా రక్షణ కరువైందంటూ కన్నీళ్లు పెట్టారు! చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో బీమా క్లెయిమ్‌గా నలుగురు బాధిత కుటుంబాలకు చెల్లించిన మొత్తం రెండంటే రెండు లక్షల లోపే ఉంది.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక 28 లక్షల మందికి రూ.42 లక్షలకుపైగా క్లెయిమ్‌ పరిహారం అందచేసింది. మరో రూ.25 లక్షల మొత్తానికి సంబంధించిన క్లెయిమ్‌లు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ప్రవాసుల భద్రత, డబ్బు విషయంలో వెనుకాడే ప్రభుత్వమైతే సొంత ఖర్చులతో విపత్తు వేళ ఆగమేఘాలపై వారిని స్వస్థలాలకు తరలిస్తుందా? బీమా ప్రీమియం స్వల్ప మొత్తంలోనే రూ.ఐదారు వందలు లోపే ఉంటుంది.

అయితే ప్రవాసాంధ్రుల్లో చాలా మంది విదేశాల్లో తాము పని చేస్తున్న చోట్ల బీమా కవరేజీని పొందుతున్నందున ప్రవాసాంధ్ర బీమా భరోసాను తీసుకోవడంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమే అనే రీతిలో రోత కథనాలను అచ్చేసి రామోజీ పైశాచిక ఆనందాన్ని పొందడంపై విస్మయం వ్యక్తమవుతోంది.   

2.5 లక్షల మందికి ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్‌ సేవలు
ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్‌ గత నాలుగేళ్లలో 2,55,000 మంది ప్రవాసాంధ్రులకు వివిధ సేవలతో సాయాన్ని అందించింది. 24/7 ద్వారా ప్రవాసాంధ్రులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవాసాంధ్రుల బీమా పథకం క్లెయిమ్‌ కింద కేవలం నలుగురికి రూ.2 లక్షల లోపే అందించగా ఇప్పుడు గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం 28 మందికి పరిహారంగా రూ.42,05,604 చెల్లించింది.

రూ.25,53,700 విలువైన మరో పది క్లెయిమ్‌లు పురోగతిలో ఉన్నాయి. బీమానే కాకుండా అంబులెన్సు, ఎక్స్‌గ్రేషియా, రీ పాట్రియేషన్‌ ద్వారా అధిక సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందారు. అనారోగ్య బాధితులతోపాటు మృతుల భౌతిక కాయాలను విమానాశ్రయాల నుంచి స్వస్థలాలకు తరలించేందుకు 1,077 అంబులెన్సులను ప్రభుత్వం సమకూర్చింది. ఇందుకోసం రూ.1.93 కోట్లకు పైగా వెచ్చించింది.

ప్రమాదవశాత్తు విదేశాల్లో మరణించిన 489 మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.2.44 కోట్లకుపైగా చెల్లించింది. వివిధ కారణాలతో విదేశాల్లో చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్న 4,622 మందిని రీపాట్రియేషన్‌తో స్వస్థలాలకు క్షేమంగా తరలించింది.  – వెంకట్‌ మేడపాటి, ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్‌ ప్రెసిడెంట్‌  

♦ దాదాపు 20 లక్షల మంది ప్రవాసాంధ్రుల్లో గత సర్కారు కేవలం 16,713 మందికి (ఒక్క శాతం) మాత్రమే బీమా  కల్పిస్తే అది చాలా గొప్పంటూ డప్పు కొట్టిన రామోజీకి కరోనా విపత్తులో వేల మంది ప్రవాసులను ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా మాతృభూమికి తరలించిన విషయం తెలుసా? ఉక్రెయిన్‌ యుద్థం లాంటి సందర్భాల్లో ప్రభుత్వం సత్వరమే స్పందించి డబ్బుకు వెనుకాడకుండా ప్రవాసులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచి్చంది. ఇమ్మిగ్రేషన్‌ అధికారులతో సంప్రదించి 50 వేల మంది వలస కార్మికులను రాష్ట్రానికి క్షేమంగా తరలించింది. 

♦ బీమా రక్షణ అనేది స్వచ్ఛందం. అవగాహన కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అవసరమైన వారు ముందుకొచ్చి తీసుకుంటారు. అమెరికా, కెనడా, యూకే, ఐరోపా, ఆస్ట్రేలియా తదితర చోట్ల తాము పని చేస్తున్న సంస్థల్లో బీమా ప్రయోజనాలు అందుతున్నందున ప్రవాసులు ప్రభుత్వ పథకంలో చేరడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. మరి ఇది కూడా ప్రభుత్వ తప్పిదమేనా రామోజీ? 

♦కోవిడ్‌ విపత్తు, రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం సమయంలో లక్షల మంది ప్రవాసాంధ్రులు వెనక్కి వచ్చేశారు. బీమా సౌకర్యం లేని వారిని గుర్తించి పథకం ప్రయోజనాలు వివరిస్తూ అందులో చేర్చేందుకు ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్‌ పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. తద్వారా గత ప్రభుత్వ హయాం కంటే మెరుగ్గా 33,596 మందికిపైగా బీమా ప్రయోజనాన్ని పొందారు. విదేశాలకు వలస వెళ్లే కార్మికులకు మూడేళ్లకు కేవలం రూ.550 ప్రీమియం అంటే రోజుకు సుమారు 50 పైసలకే అందిస్తున్నా అది కూడా భారమే అంటూ రాగాలు తీయడం వారిని అవమానించడం కాదా?  

♦  ఎలా చూసినా గత సర్కారు రెండేళ్లలో ప్రవాసాంధ్రులకు అందించిన ప్రయోజనం కంటే గత నాలుగేళ్లుగా చేకూరిన లబ్ధి 10 రెట్లు అధికంగా ఉంది.

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top