
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు బడ్జెట్‌లో రూ.11,900 కోట్ల అప్పు చేయనుంది. ఈ మేరకు సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల రుణాల సమీకరణ క్యాలెండర్‌ను ఆర్‌బీఐ నోటిఫై చేసింది.
ఇందులో భాగంగా మంగళవారం ఏపీ రూ.1,900 కోట్లు అప్పు చేయనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. నవంబర్ 4న రూ.5,000 కోట్లు, డిసెంబర్ 2న మరో రూ.5,000 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.