ధరల పతనంలో బాబు ‘రికార్డు’ | Former CM YS Jagan Fires On Coalition Government, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ధరల పతనంలో బాబు ‘రికార్డు’

Sep 17 2025 5:21 AM | Updated on Sep 17 2025 9:19 AM

Former CM YS Jagan fires on coalition government

కూటమి సర్కారుపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ధ్వజం

కర్నూలులో కిలో ఉల్లి 3 రూపాయలు.. రూపాయిన్నరకే కిలో టమాటానా? 

బిగ్‌ బాస్కెట్, ఇతర ఆన్‌లైన్‌ స్టోర్లలో మాత్రం కిలో ఉల్లి రూ.29 నుంచి రూ.32 దాకా విక్రయం 

రైతులకు ధర దక్కడం లేదు.. బయట మాత్రం దిగి రావడం లేదు.. ఇవేం ధరలు..?.. రైతులు బతకొద్దా?.. తక్షణం పంటలు కొనుగోలు చేసి మానవత్వాన్ని చూపండి 

కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం.. ఉన్నా లేనట్లే కదా!  

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లే రాష్ట్రంలో రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు దక్కని దుస్థి­తిని ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్న­ప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా? అని దెప్పిపొడిచారు. 

కర్నూలులో ఉల్లి రైతులకు కిలో రూ.మూ­డు మాత్రమే దక్కుతుండగా బిగ్‌ బాస్కెట్, ఇతర ఆన్‌లైన్‌ స్టోర్లలో మాత్రం కిలో రూ.29 నుంచి రూ.32 దాకా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే రైతుల నుంచి పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వం వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపాలని హితవు పలికారు. ఈమేరకు తన ‘ఎక్స్‌’ ఖాతాలో వైఎస్‌ జగన్‌ మంగళవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..

» చంద్రబాబు గారూ.. పంటల ధరల పతనంలో మీరు సాధించిన రి­కార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కా­వు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూ­పా­యి­న్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు..? రైతు అ­నేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబో­దిబోమంటున్నా మీరు కనికరం కూడా చూపడం లేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదు­కోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా? 

»  క్వింటా ఉల్లిని రూ.1,200 చొప్పున కొనుగోలు చేస్తా­మంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశా­రు. కా­నీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మా­ర్కె­­ట్లో వే­లం వేయించారు. ఎవరూ కొనడం లేదు.. ఏ­మీ చేయ­లేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది? ఉల్లికి అసలు ధరే లే­కపోతే ఇప్పుడు బిగ్‌ బాస్కెట్, ఇతర స్టోర్లలో ఆన్‌­లైన్‌లో పరిశీ­లిస్తే కిలో రూ.29 నుంచి రూ.32 దాకా ఎ­లా అ­మ్ముతు­న్నారు? 

రైతు బజార్లో కూడా కిలో రూ.25­కి త­క్కు­వ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందు­కు ధర రా­వ­డం లేదు? ఇది మీ తప్పు కాదా చంద్రబాబు గారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టి పెట్టకపోడం అన్యాయం. అటు ట­మా­­టా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించు­­కోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పా­­రబోస్తున్నారు. తక్షణం రైతుల పంటలను కొ­ను­గో­లు­­చేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement