
ఈనెల 5న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్ప పీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
సాక్షి, విశాఖపట్నం: వాయుగండం ముప్పు తొలగిపోయిందని ఏపీ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలో మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఈనెల 5న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్ప పీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
అల్పపీడనం బలపడటానికి అనుకూలంగా రుతుపవన ద్రోణులు ఉన్నాయి. వచ్చే 24 గంటల్లో కృష్ణ, గుంటూరు జిల్లాలకు మరోసారి వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.. దీంతో వరద ముంపు పెరిగే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూ.గో, ఏలూరు,బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.
