బలం కుదిరేనా..?
మెజార్టీ వార్డులు గెలిచినా.. ‘మ్యాజిక్’కు స్వల్ప దూరంలో బీజేపీ
ఎక్స్‌అఫీషియోగా ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే నమోదు
ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా వస్తారంటున్న ‘కమలం’ పార్టీ
కొత్త నమోదు రూల్ పొజీషన్‌లో లేదంటున్న అధికారులు
గెలిచిన స్వతంత్రులు మా దగ్గరంటే.. మా దగ్గరంటున్న పార్టీలు
ఆసక్తికరంగా బల్దియా రాజకీయం
బల్దియా పాలకవర్గ ఏర్పాటుపై..
సాక్షి,ఆదిలాబాద్: ‘మున్సిపల్‌లో మేము అత్యధిక వార్డుల్లో గెలుపొందాం.. మ్యాజిక్ ఫిగర్‌కు కూడా సమీపంలో ఉన్నాం.. గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల్లో ఇద్దరు మా వద్దే ఉన్నారు.. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేగా ఇప్పటికే ఎక్స్‌అఫీషియో రెండు ఓట్లు ఉన్నా యి.. పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీలు కూడా ఇక్క డే ఎక్స్‌అఫీషియోగా ఓటు వేస్తారు.. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పీఠాన్ని సులువుగా అధిరోహిస్తాం..’ అని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఎన్నికల కమిషన్ రూల్ పొజీషన్ ప్రకారం ఎమ్మెల్సీలుగా ఎన్నికై న నెలరోజుల్లోపు ఎక్కడైన ఒకదగ్గర ఎక్స్‌అఫీషియోగా నమోదు చేసుకొని ఉండాలి. అయితే ఇప్పటి వరకు ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఎక్స్‌అఫీషియోగా నమోదై లేరని చెబుతున్నారు కమిషనర్. ఇప్పటికై తే ఇదే రూల్ పొజీషన్ అని ఒకవేళ ఎన్నికల కమిషన్ మార్పులు చేస్తే చెప్పలేం అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులంతా తమ వద్ద ఫిజికల్‌గా ఉన్నారనే బాంబును శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పేల్చింది. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత బల్దియాపై కాషాయం జెండా ఎగరబోతుందని బీజేపీ ధీమాగా చెబుతుండగా, వారికి సంఖ్యాబలం ఎలా కుదురుతుందో చూస్తామంటోంది ‘హస్తం’ పార్టీ. అసాధ్యంగా కనిపిస్తున్నప్పటికీ పాలకవర్గం ఏర్పాటులో మేము ప్రయత్నం వీడలేదని కాంగ్రెస్ చెబుతుండటం సంచలనం కలిగిస్తోంది. బల్దియా రాజకీయాలను ఆసక్తికరంగా మార్చింది.
సంఖ్యాబలం ప్రకారం..
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నా యి. బల్దియాలో పాలకవర్గం ఏర్పాటుకు వార్డుల సంఖ్యా బలం ప్రకారం చూస్తే.. 25 మంది కౌన్సి లర్లు గెలిచిన పార్టీ మెజార్టీ సాధించినట్టే. పాలకవర్గం ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బీజేపీ 21 వార్డుల్లో గెలిచింది. మెజార్టీకి స్వల్ప దూరంలో నిలిచింది. వార్డుల సంఖ్యా బలం ప్రకారం మరో నలుగురు కౌన్సిలర్ల మద్దతుతో పాలకవర్గం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు మినహా యిస్తే ఇక మిగిలింది ఐదుగురు స్వతంత్రులు. అందులో ఇద్దరు తమ వద్ద ఉన్నారని బీజేపీ చెబుతుంది. ఐదుగురు ఫిజికల్‌గా తమ దగ్గర ఉన్నారని కాంగ్రెస్ పేర్కొంటుంది. దీంతో బల్దియా పీఠాన్ని బీజేపీ సులువుగా కై వసం చేసుకునేందుకు వీలవుతుందా.. అందుకు అనువుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆ పార్టీ మలుచుకుందా.. లేదా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు ఎమ్మెల్సీల ఎక్స్‌అఫీషియో నమోదు అంశంలోనూ రూల్ పొజీషన్‌లో మార్పులు చేస్తేనే సాధ్యమని మున్సి పాలిటీ చెబుతున్న నేపథ్యంలో పాలకవర్గం ఏర్పాటులో తకరారు కనిపిస్తుంది.
ప్రత్యేక సమావేశంలోపు..
మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక ఈనెల 16న ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో జరగనుంది. ఆరోజు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ఉదయం సెషన్‌లో కౌన్సిలర్లందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక చేపట్టాలి. అప్పటివరకు బీజేపీ పాలకవర్గం ఏర్పాటుకు అడ్డంకులను తొలగించుకుంటుందా.. రాజ్య సభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫీషియోగా ఓటు వేసేందుకు మా పార్టీ నుంచి కూడా ఇక్కడ అవకాశం ఇస్తే మా ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయని కాంగ్రెస్ చెబు తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ఈ మిగిలిన సమయంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయి.. బల్దియా పీఠంపై ఎవరు కూర్చుంటారు.. చైర్ పర్సన్‌గా ఎవరు ఎన్నికవుతారు.. ఇవన్నీ అంశాలు ప్రస్తుతం పట్టణ ప్రజలతో పాటు రాజకీయ పార్టీల్లో ఆసక్తి రేపుతుంది.


