అత్యధికం 968.. అత్యల్పం 12 | - | Sakshi
Sakshi News home page

అత్యధికం 968.. అత్యల్పం 12

Feb 14 2026 7:47 AM | Updated on Feb 14 2026 7:47 AM

అత్యధికం 968.. అత్యల్పం 12

అత్యధికం 968.. అత్యల్పం 12

● విజేతలు సాధించిన మెజార్టీ తీరు

కైలాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ 40వ వార్డులో నమోదు కాగా, అత్యల్ప మెజార్టీ 34వ వార్డులో వచ్చింది. 40వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి అమరబోయిన సాయిచరణ్‌ గౌడ్‌కు 1,352 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ఉష్కం రఘుపతికి 384 ఓట్లు పోలయ్యాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కడ్తారపు అశోక్‌కు 174 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిపై 968 ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. అలాగే 34వ వార్డులో బీజేపీ అభ్యర్థి నిఖిలకు 626 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌కు 507 ఓట్లు పోలయ్యాయి. ఎంఐఎం అభ్యర్థి, ఆ పార్టీ అధ్యక్షుడు నజీర్‌ అహ్మద్‌కు 638 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థిపై ఎంఐఎం అభ్యర్థి 10 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement