రూ.34వేల నగదు స్వాధీనం
దేశీదారు విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు
నేరడిగొండ: అక్రమంగా దేశీదారు విక్రయిస్తు న్న వ్యక్తిని అరెస్ట్ చేసి 115 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ జు ల్ఫీకర్ అహ్మద్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం మండలంలోని రాజులతండా గ్రామంలో సోదాలు నిర్వహించి నట్లు పేర్కొన్నారు. సాబ్లే విజ్ఞాన్‌సింగ్ అనే వ్య క్తి మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చిన దేశీదారు అక్రమంగా విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తె లిపారు. ఆయనపై కేసు నమోదు చేసి మద్యం బాటిళ్లు సీజ్ చేసినట్లు వివరించారు. గంజా యి, బెల్లం, పటిక, దేశీదారు, గుడుంబా విక్రయించినా, రవాణా చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడుల్లో శిక్షణ పొందుతున్న ఉప పరిశీలకుడు వీ శ్రీనివాస్, సిబ్బంది కార్తిక్, మహ్మద్, అరుణ, మంజుల పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం రాత్రి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో ఓ కారులో దొరికిన రూ.34వేల నగదు స్వాధీనం చేసుకోవటం ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానిక బీజోన్ సెంటర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ నాయకు డి కారును ఆపి పరిశీలించారు. ఈ క్రమంలో కారులోని పర్సులో రూ.34వేల నగదు కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం రూ.50వేల కంటే ఎక్కువ నగదు ఉంటేనే స్వాధీనం చేసుకోవాలని ఉండగా రూ.34వేలు ఎలా స్వాధీనం చేసుకుంటారని బీఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నించారు. పార్టీ సీనియర్ నేత డాక్టర్ రాజరమేశ్‌తోపాటు ఇతర నాయకులు పట్టణ ఎస్‌ఐ శ్రీధర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నాయకులకు వ త్తాసు పలుకుతూ వారి వాహనాలను తనిఖీ చేయకుండా కేవలం బీఆర్‌ఎస్ నాయకులనే టార్గెట్ చే స్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనతో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మందమర్రి తహసీల్దార్ సతీశ్ స్పందిస్తూ ఎన్నికల కోడ్ అమలు లో ఉన్న నేపథ్యంలో అనుమానాస్పదంగా కనిపించిన సందర్భాల్లో ఎంత నగదు అయినా స్వాధీనం చేసుకుని విచారణ చేస్తామని పేర్కొన్నారు.


