చిక్సిత పొందుతూ ఇద్దరు మృతి
కౌటాల: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు చిక్సిత పొందుతూ మంగళవారం మృతి చెందారు. వివరాలు.. మండలంలోని గురుడుపేట గ్రామానికి చెందిన నాగోశే మొండి (17), బోదంపల్లి గ్రామానికి చెందిన ఆదే అభిరాం (6), వడాయి మోహన్ ఈ నెల 7న బెజ్జూర్ మండలం హేటిగూడలోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో బైక్‌పై వెళ్లారు. ఈ క్రమంలో హేటిగూడ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్ నిలో ఫర్ ఆస్పత్రికి తరలించగా చిక్సిత పొందుతూ అభిరాం సోమవారం మృతి చెందగా.. నగేశ్ మొండి మంగళవారం మృతి చెందినట్లు కు టుంబీకులు తెలిపారు. వడాయి మోహన్ ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సర్తార్ పాషా తెలిపారు. బైక్ అతివేగం, అజాగ్రత్తతో నడపం, నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పి కిందపడి ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.
బావిలో పడి ఇంటర్ విద్యార్థిని మృతి
ఉట్నూర్‌రూరల్: నీటి కోసం వెళ్లిన ఇంటర్ విద్యార్థిని ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన మండలంలోని హస్నాపూర్‌లో చోటు చేసుకుంది. ఏఎస్సై రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హస్నాపూర్ గ్రామానికి చెందిన మోహన్ కుమార్తె సోనీ (17) నార్నూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. సోనీ ఆరు నెలలుగా తలనొప్పితో బాధ పడుతోంది. ఆస్పత్రుల్లో చి కిత్స చేయించినా నయం కాలేదు. దీంతో ఇంటి వద్దే ఉంటోంది. మంగళవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలోని బావి వద్దకు నీటి కోసమని వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందింది. సోనీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బావి వద్దకు వెళ్లి చూడగా కనిపించలేదు. అనుమానంతో బావిలో వెతకగా సోనీ మృతదేహం లభించింది. సోనీ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు ఆమె తండ్రి మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.
చిక్సిత పొందుతూ ఇద్దరు మృతి


