రెండు గంటల్లోనే చోరీ కేసు ఛేదన
ఆదిలాబాద్‌టౌన్: జైనథ్ మండలంలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు రెండు గంటల్లోనే ఛేదించారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తన కార్యాలయంలో మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సాత్నాల మండలం కెనాల్ మేడిగూడ గ్రామానికి చెందిన గుమ్మడి రవీందర్ కూలీ పనులు చేస్తూ జీ వనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతడు డబ్బులు అవసరమై అదే గ్రామానికి చెందిన బరపటి వెంకటి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడ్డాడు. బీరువాలోని మూడున్నర తులాల బంగా రం, 50 తులాల వెండి ఆభరణాలు, ఎనిమిది తు లాల రాగి వస్తువులు దొంగలించి తన ఇంటి సమీ పంలో మట్టిలో దాచిపెట్టాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జైనథ్ పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. గ్రామంలో అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న రవీందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, దొంగతనం చేసినట్లు ఒప్పుకొన్నాడు. అనంతరం అతని ఇంటి సమీపంలో మట్టిలో దాచిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.5లక్షల వరకు ఉంటుంది. అత్యంత వేగంగా కేసు ఛేదనలోకీలకపాత్ర పోషించిన జైనథ్ సీఐ శ్రావణ్, సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.
రెండు గంటల్లోనే చోరీ కేసు ఛేదన


