ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి | - | Sakshi
Sakshi News home page

ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి

Feb 11 2026 7:34 AM | Updated on Feb 11 2026 7:34 AM

ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి

ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి

ఆదిలాబాద్‌టౌన్‌: సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని టీపీయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బడ్నాల రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మోడల్‌ స్కూల్‌, ఐటీడీఏ, సమగ్ర శిక్ష నాయకులు రాష్ట్ర అధ్యక్షునికి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుమ్ర యాదవ్‌రావ్‌, మహిళా అధ్యక్షురాలు జీజాబాయి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీల్‌చవాన్‌, గోపీకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుమ్ర యాదవ్‌రావ్‌, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం

సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎనుకుని అ నంతరం వారితో ప్రమాణాస్వీకారం చేయించారు. ఆర్థిక కార్యదర్శిగా ఉదార్‌ కేశవ్‌, ఉపాధ్యక్షులుగా గోమంత్‌రెడ్డి, గంగాధర్‌, నవనీత, విలాస్‌, సత్యనారాయణ, సురేశ్‌, కార్యదర్శులుగా జ్యోతిరాం, రాజేశ్‌, శ్రీనివాస్‌, అనిల్‌, సుమన్‌, స్వామి, రాష్ట్ర కా ర్యవర్గ సభ్యులుగా బచ్చునారాయణ, అంబాజీ, సంగీత, ప్రకాశ్‌, గోపాలకృష్ణ, రాజ్‌కుమార్‌, ప్రచా ర కార్యదర్శిగా జయసారథి, మహిళా విభాగం కన్వీనర్‌గా జీజాబాయి, కోకన్వీనర్‌గా గౌతమి, సేవా విభాగం కన్వీనర్‌గా వీరయ్య, కోకన్వీనర్‌గా అర్జున్‌ పవార్‌, సాంస్కృతిక, క్రీడల విభాగం కన్వీనర్‌గా రాజ్‌కుమార్‌, మోడల్‌స్కూల్‌ కన్వీనర్‌ రాజశేఖర్‌, ఐటీడీఏ విభాగం కన్వీనర్‌గా వసంత్‌రావు, పర్యావరణ విభాగం కన్వీనర్‌ వాసుదేవ్‌ ముండే, ఆర్చీవ్‌ విభాగం కన్వీనర్‌గా సురేందర్‌ రాథోడ్‌, హమారా విద్యాలయ్‌ హమారే తీర్థ్‌ వింగ్‌ కన్వీనర్లుగా నాగేశ్‌, రాకేశ్‌ను ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement