నేడే ‘పుర’ పోరు | - | Sakshi
Sakshi News home page

నేడే ‘పుర’ పోరు

Feb 11 2026 7:33 AM | Updated on Feb 11 2026 7:33 AM

నేడే

నేడే ‘పుర’ పోరు

● సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం ● ఉదయం 7గంటల నుంచి పోలింగ్‌ ● అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ● 37చోట్ల మైక్రోఅబ్జర్వర్ల నియామకం

ఎన్నికల సామగ్రితో సిబ్బంది

కై లాస్‌నగర్‌: జిల్లాలోని ఏకై క ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పట్టణంలోని 49 వార్డులకు గాను 314 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారి భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్‌ ద్వారా బాక్స్‌ల్లో నిక్షిప్తం చేయనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 216 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రానికి ఒక పీవో, ఏపీవో, ముగ్గురు సహాయకుల చొప్పున 1,080 మందిని నియమించారు. మరో 218 మందిని రిజర్వ్‌లో ఉంచారు. వీరికి మూడు విడతల్లో శిక్షణ అందించారు. ర్యాండమైజేషన్‌ ద్వారా ఆయా కేంద్రాల్లో వారికి విధులు కేటాయించారు. మొత్తం వార్డులను 14 రూట్‌లుగా విభజించి 14 మంది రూట్‌, 14 మంది జోనల్‌ అధికారులను నియమించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా అన్ని కేంద్రాల పరిధిలో 163 బీఎన్‌ఎస్‌ చట్టం అమలు చేయనున్నారు.

ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు..

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. ఓటర్లందరికీ ఇప్పటికే బీఎల్‌వోల ద్వారా పోల్‌ చీటీలను పంపిణీ చేశారు. ప్రతీ రెండు గంటలకోసారి పోలింగ్‌ సరళిని ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లకు వైట్‌ కలర్‌ బ్యాలెట్‌ పత్రం ఇవ్వనున్నారు. ప్రతీ కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్‌ బాక్స్‌ చొప్పున 216 ఏర్పాటు చేశారు. అదనంగా మరో 44 రిజర్వ్‌లో ఉంచారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, ప్రథమ చికిత్స వంటి సదుపాయాలను కల్పిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేసేందుకు వీలుగా వీల్‌ చైర్లతో కూడిన ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా ఐదు పోలింగ్‌ కేంద్రాలను మోడల్‌గా తీర్చిదిద్దారు. అక్కడ షామియానాలు, కుర్చీలు, తాగునీరు వంటి అన్ని వసతులు కల్పిస్తున్నారు.

128 కేంద్రాలపై ప్రత్యేక నిఘా

పట్టణ పరిధిలోని 62 ప్రాంతాల్లో గల 128 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇందులో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేలా తగు చర్యలు చేపట్టారు. అలాగే 35 లోకేషన్స్‌లోని 37 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. అన్ని కేంద్రాల్లో ప్రక్రియను పర్యవేక్షించేందుకు వీలుగా వెబ్‌ కాస్టింగ్‌ చేయనున్నారు. టీటీడీసీలోని ప్రత్యేక కేంద్రం నుంచి అధికారులు పోలింగ్‌ సరళిని పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.

మొత్తం ఓటర్లు 1,43,655

బ్యాలెట్‌

బాక్స్‌లు

260

ఎన్నికలు జరిగే వార్డులు 49

మున్సిపల్‌

ఎన్నికల నిర్వహణ

వివరాలు

పోలింగ్‌

సిబ్బంది

1,298

బరిలో నిలిచిన

అభ్యర్థులు

314

పోలింగ్‌

కేంద్రాలు

216

నేడే ‘పుర’ పోరు1
1/3

నేడే ‘పుర’ పోరు

నేడే ‘పుర’ పోరు2
2/3

నేడే ‘పుర’ పోరు

నేడే ‘పుర’ పోరు3
3/3

నేడే ‘పుర’ పోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement